హైటెక్ సిటీలోని సైబర్ గేట్ వే ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై ఉన్నట్టుండి భారీ గుతం ఏర్పడడంతో వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యాయి. అయితే.. వెంటనే అప్రమత్తమైన మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు కుంగిన చోట భారీకేడ్లు ఏర్పాటు చేశారు. వాహనదారులను అలర్ట్ చేస్తూ పక్కనుంచి వెళ్లాలని చెబుతున్నారు. అదృష్టవశాత్తూ రోడ్డు కొద్దిగా కిందకు కుంగిన వెంటనే అప్రమత్తవడంతో
ఎలాంటి ప్రమాదాలు జరుగలేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రోడ్డు కుంగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

