
బీజేపీ మాజీ అధికార ప్రతినిధిని బాంబే హైకోర్టు జడ్జీగా నియమించడం మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఒక రాజకీయ నేతను న్యాయమూర్తిగా నియమిస్తే సామాన్యుడికి న్యాయం ఎక్కడ లభిస్తుందని విపక్ష నేతలు విమర్శిస్తుండగా, గతంలో కాంగ్రెస్ హయాంలోనూ ఇటువంటి నియామకం జరిగిందని, అప్పుడు అది ఒప్పయినప్పుడు ఇప్పుడెలా తప్పవుతుందని బీజేపీ ప్రశ్నిస్తున్నది. బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేసిన లాయర్ ఆర్తీ సాథేను కొలీజియం ఇటీవల బాంబే హైకోర్టు జడ్జీగా నియమించింది. దీనిపై ఎన్సీపీ (ఎస్పీ) ఎంఎల్‌ఏ రోహిత్ పవార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.