
న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు ట్రంప్ తన భార్య మెలానియాతో కలిసి హాజరైన విషయం తెలిసిందే. సమావేశాల అనంతరం మెరైన్ వన్ హెలికాప్టర్లో అధ్యక్షుడి దంపతులు తిరుగు పయనమయ్యారు. ఆ సమయంలో హెలికాప్టర్లో ఎదురెదురుగా కూర్చున్న ట్రంప్-మెలానియా ఒకరివైపు ఒకరు వేలు చూపించుకుంటూ మాట్లాడుతూ కనిపించారు. వారిద్దరూ ఏదో విషయంపై గొడవ పడుతున్నట్లు ఆ వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.