
హెచ్‌సీయూలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని అర్బన్ వాటర్ అండ్ క్లైమెట్ చేంజ్ నిపుణుడు బీవీ సుబ్బారావు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రం మొత్తంలో ఉన్న భూవినియోగంలో 35 శాతం అడవులకు కేటాయించాలని ఆయన సూచించారు. ప్లానింగ్ దశలో ఐదు అంశాలను తప్పనిసరిగా జోడించాలని పేర్కొన్నారు. భూమి, నీరు, గాలి, శక్తి, ఓపెన్ స్పేస్‌లను ఐదు అంశాలుగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. హెచ్‌సీయూ భూమి ప్రజల ఆస్తి అని, విద్యార్థులు చేసే ఆందోళనలకు ప్రజలు కూడా బాసటగా నిలవాలని కోరారు. ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్య వ్యవస్థకు ధర్మకర్తలు మాత్రమేనని, యజమానులు కాదని చెప్పారు.