
దళితవాడల్లో ఐదు వేల ఆలయాలు కట్టిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖండించడం తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో షర్మిల స్పందించి, తన వాదనను వివరించారు. హిందూ ధర్మానికి, మతానికి తాను కానీ, కాంగ్రెస్ పార్టీ గానీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ దృష్టి దళితవాడల్లో గుడులు కట్టడానికి ముందు స్థానికంగా బడుల మీద, మౌలిక వసతుల కల్పన మీద ఉండాలని చెప్పడం తప్పా ? అని ప్రశ్నించారు.