కాంగ్రెస్ సర్కార్ వాగ్ధానాలను అమలు చేయడంలో విఫలమైందని సొంత పార్టీకి చెందిన నేతలే స్వయంగా ఒప్పుకుంటున్నారు. శాసనమండలిలో విజయ శాంతి మాట్లాడుతూ.. ఉద్యమ కారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తానన్నారు. రూ.4 వేలు పెన్షన్, రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తానన్నారు. ఇంతవరకు మా ఉద్యమకారులకు మా ప్రభుత్వం ఇవ్వలేదు. అది కొంచెం నాకు బాధగా అనిపించింది. మా ఉద్యమకారులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి చేసి ఉంటే ఉంటే గౌరవంగా ఉండేదన్నారు విజయ శాంతి .

