హర్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలని, లేకపోతే ఇరాన్‌పై దాడులు ఉద్ధృతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ విద్యుత్ ప్లాంట్‌లను పూర్తిగా ధ్వంసం చేస్తామని ఆదివారం పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఈ మేరకు ట్రంప్ తన సొంత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఇప్పటికే ఇరాన్ చమురు విక్రయంపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తేస్తున్నట్లు అమెరికా ప్రకటించగా అందులో ఎలాంటి వాస్తవం లేదని ఇరాన్ స్పష్టం చేసింది.

