హన్మకొండ హంటర్ రోడ్డులోని జూలజికల్ పార్క్‌లో తెల్ల పులి(శరణ్) మంగళవారం తెల్లవారుజామున ఎక్లోజర్‌లో మృతి చెందింది. వృద్ధాప్యం, మల్టీ ఆర్గాన్ ఫెల్యూర్‌తో తెల్ల పులి మృతి చెందినట్లు జూ అధికారులు వెల్లడించారు. శరణ్ అంతక్రియలు మంగళవారం చేసినట్లు జూ పార్క్ పర్యవేక్షణ అధికారి తెలిపారు. శరణ్‌ను హైదరాబాద్ జూ పార్క్ నుండి జులైలో తీసుకువచ్చామని అన్నారు. జూ పార్కులో పులి సంరక్షణ సరిగ్గా లేకనే అనారోగ్యంతో మరణించినట్లు తెలుస్తుంది. కానీ జూ అధికారులు సిబ్బంది మాత్రం అనారోగ్యంతో గుండెపోటుతో మరణించినట్లు చెప్తున్నారు.

