79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగం ఆలోచన, ప్రేరణ రెండింటినీ ప్రతిబింబించే సంప్రదాయాన్ని కొనసాగించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది రాష్ట్రపతి ముర్ము చేసిన నాల్గవ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం కావడం విశేషం.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలందరికీ తన సందేశంలో అభినందనలు తెలిపారు.
స్వాతంత్ర్య దినోత్సవం పూర్తి ఉత్సాహంతో జరుపుకోవడం మనందరికీ గర్వకారణమని అన్నారు.

