మెటాకు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫాం ఇన్స్టాగ్రామ్ స్నాప్ చాట్ కు పోటీగా ‘ఇన్స్టాంట్స్’ (Instants App) పేరుతో క్విక్ ఫొటో షేరింగ్ యాప్ను ప్రారంభించింది. యాప్ లో కెమెరాను ఉపయోగించి ఒకే ట్యాప్తో ఫొటోలు తీసుకోవచ్చు. వీటిని షేర్ చేసిన అనంతరం చాట్ లిస్ట్లో 24 గంటల పాటు ఉండి ఆ తర్వాత వాటంతట అవే డిలీట్ అవుతాయి. కెమెరాను ఉపయోగించి తీసిన చిత్రాలను మాత్రమే షేర్ చేయగలరు. ప్రస్తుతం ఈ యాప్ స్పెయిన్, ఇటలీలోని ఆండ్రాయిడ్, iOS వినియోగదారులకు అందుబాటులో ఉంది.

