ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, నటుడు సోనూ సూద్, మాజీ ఎంపీ మిమీ చక్రవర్తికి చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ‘1XBet’ అనే వివాదాస్పద ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినందుకు వీరిపై చర్యలు తీసుకున్నారు. ఈ సెలబ్రిటీలు ఆ సంస్థ నుంచి భారీగా నగదు తీసుకున్నట్లు ఆధారాలు లభించాయి.

