
సోషల్ మీడియా పోస్టులపై రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెడుతున్న తీరుకు తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో పాటు చట్టాల స్ఫూర్తితోనే పోలీసులు పని చేయాలని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోస్టులు చేసినందుకు కేసులు పెడతామంటే చెల్లదని, కేసులు పెట్టే ప్రతి వ్యక్తి ఏ విధంగా తనకు వ్యక్తిగతంగా నష్టం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత
ఉంటుందని అప్పుడే ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని కఠినమైన ఆదేశాలను మార్గదర్శకాలను జారీ చేసింది.