
అమెరికా వీసా దరఖాస్తుదారులకు అమెరికా దౌత్య కార్యాలయం ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. DS-160 ఫారంలో గత ఐదేళ్ల సోషల్ మీడియా వివరాలు పూర్తిగా వెల్లడించకపోతే వీసా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని చెప్పింది. అంతేకాకుండా భవిష్యత్తులో అమెరికా వీసాలకు కూడా అనర్హులు కావచ్చని వివరించింది. విద్యార్థి, ఉద్యోగ వీసాదారులు తమ ఖాతాలను పబ్లిక్‌గా ఉంచాలని సూచించింది.