
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉదర సంబంధిత సమస్యతో బాధపడుతూ.. ఆదివారం రోజు ఆస్పత్రిలో చేరిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆమె ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరగా..
ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే మరికొన్ని గంటలు ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యు నిశితంగా పరిశీలిస్తారని కూడా ఆస్పత్రి ఛైర్మన్ అజయ్ స్వరూప్ వెల్లడించారు.