ఉత్తర ప్రదేశ్‌కు చెందిన దివ్య సింగ్.. కాఠ్మండు నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకూ 14 రోజుల్లో సైకిల్‌పై ప్రయాణించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. గడ్డకట్టే చలి, నిటారుగా ఉండే భూభాగం, తక్కువ ఆక్సిజన్ స్థాయిలను ఎదుర్కొంటూ.. ఆమె రోజూ గంటల తరబడి సైకిల్ తొక్కారు. వీలుకాని చోట భుజాన మోస్తూ ఆమె సాగించిన ప్రయాణం.. భారతీయ మహిళా శక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

