టీ20 ప్రపంచకప్ నుంచి ఆస్ట్రేలియా జట్టు ఇంటిదారి పట్టింది. మూడు మ్యాచ్ ల్లో ఆసీస్ ఒక విజయాన్ని మాత్రమే సాధించింది. మరోవైపు, రెండు మ్యాచ్ లు గెలిచిన జింబాబ్వే జట్టు నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. మంగళవారం తన మూడో మ్యాచ్ లో ఐర్లాండ్ తో తలపడాల్సి ఉండగా.. వర్షం కారణంగా మ్యాచ్ ను రద్దు చేశారు. ఇరుజట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. దీంతో 5 పాయింట్లకు చేరుకున్న జింబాబ్వే సూపర్ 8కి క్వాలిఫై అయింది.

