
ప్రముఖ తెలుగు రాజకీయ నేతల్లో ఒకరు అయిన టి. సుబ్బారెడ్డి కుటుంబానికి చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ కంపెనీకి బ్యాంకులు వన్ టైం సెటిల్మెంట్ ప్రకటించాయి. హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ గాయత్రీ ప్రాజెక్ట్స్ ప్రమోటర్లు
సమర్పించిన రూ. 2,400 కోట్ల వన్-టైమ్ సెటిల్‌మెంట్ (OTS) ప్లాన్‌ను ఆమోదించింది. ఈ ప్లాన్ ద్వారా కెనరా బ్యాంక్ నేతృత్వంలోని రుణదాతలకు రూ. 8,100 కోట్ల బకాయిలకు బదులు రూ. 2400 కోట్లు చెల్లించి విముక్తలవుతారు. కంపెనీని మళ్లీ సొంతం చేసుకుంటారు.