
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అనంతపురంలో జరిగిన ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ సభలో ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా రూ.15,000 ఆర్థిక సాయం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయం తగ్గవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో, వారికి భరోసా కల్పించేందుకు ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. దసరా రోజున ఈ సహాయం నేరుగా ఆటో డ్రైవర్ల ఖాతాల్లో జమ అవుతుందని ప్రకటించారు.