
ఆర్ధిక సంవత్సరంలో 2024-2025 సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాల్లో 35 శాతం వాటా కార్మికులకు ఇవ్వాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, ఏఐటీయూసీ యూనియన్ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. ఏఐటీయూసీ యూనియన్ సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై యాజమాన్యానికి ఉత్తర్వులు జారీ చేసి దసరా పండుగ అనంతరం సంబంధిత మంత్రులు, యాజమాన్యంకి, గుర్తింపు సంఘం యూనియన్ ను సమావేశం ఏర్పాటు చేసి తగు నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్లుగా తెలిపారు.