
సింగపూర్‌లోని హోటల్లో సెక్స్ వర్కర్లపై దాడి చేసిన ఘటనలో ఇద్దరు భారతీయ టూరిస్టు లకు జైలుశిక్ష పడింది. దాడితో పాటు దొంగతనానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఇద్దరికీ అయిదేళ్ల శిక్ష ఖరారు చేశారు. దీంతో పాటు ఒక్కొక్కరికి 12 లాఠీబెబ్బల శిక్ష కూడా వేశారు. నిందితులను 23 ఏళ్ల అరక్కొయిసామి డైసన్, 27 ఏళ్ల రాజేంద్రన్ మైలరసన్‌గా గుర్తించారు.