
ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనలో డేటా సెంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించారు. విశాఖపట్నం ఈ రంగానికి అత్యుత్తమ ప్రదేశమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 20కిపైగా పారిశ్రామిక, పెట్టుబడి అనుకూల విధానాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రౌండ్ టేబుల్ సమావేశంలో సింగపూర్ పారిశ్రామికవేత్తలకు ఈ అవకాశాలను వివరించారు. 2026 జనవరి నాటికి అమరావతిలో తొలి క్వాంటం వ్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో సింగపూర్ కంపెనీలు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని చెప్పారు.