రియల్ ఎస్టేట్ పేరిట భారీ మోసానికి పాల్పడ్డ సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు నాలుగేళ్ల విచారణ అనంతరం మొత్తం రూ. 3000 కోట్ల రూపాయల స్కామ్‌గా దీనిని తేల్చారు. ‘ఫ్రీ లాంచ్ ఆఫర్’ పేరుతో అతి తక్కువ ధరకు ప్లాట్లు, ఫ్లాట్లు ఇస్తామంటూ వేలాది మంది కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశారు సాహితీ యాజమాన్యం. ఈ కేసులో మొత్తం 64 కేసులు నమోదయ్యాయి.

