 
		సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ్ ఏకతా దివస్ను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. దిల్లీలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారకం వద్ద రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నివాళులర్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, సర్దార్ పటేల్ జయంతోత్సవంలో పాల్గొన్నారు. పటేల్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు.
 
      
 
								 
								