
తెలంగాణ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, రోడ్లు, భవనాలకు నష్టం వాటిల్లింది. తెలంగాణ ప్రభుత్వం వరదలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికిప్పుడు అత్యవసర సాయం కింద రూ.200 కోట్ల నిధులను మంజూరు వరదలతో భారీగా నష్టాన్ని చవిచూసిన 7 జిల్లాలకు.. ఒక్కో జిల్లాకు రూ.10 కోట్ల చొప్పున మిగిలిన 26 జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.5 కోట్ల చొప్పున నిధులను మంజూరు చేసినట్లు
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.