
ఖమ్మం జిల్లాకు ఏనుకూరు మండలం జన్నారం గ్రామం సమీపంలో బుధవారం ఉదయం భయానక రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్న మరో కారు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. సకాలంలో అప్రమత్తమైన ప్రయాణికులు కారు నుంచి బయటపడి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ఘటనలో మరో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.