రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపనేతగా పక్కనపెట్టడంపై చడ్డా వీడియో మెసేజ్ షేర్ చేయగా.. దానికి ఆప్ “రాఘవ్.. గత కొన్నేళ్లుగా మీరు భయపడుతున్నారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారు. సభలో మాట్లాడటానికి లభించే కొద్దిపాటి సమయంలో కీలక అంశాలను లేవనెత్తాలి. కానీ విమానాశ్రయాల క్యాంటీన్లలో సమోసాల ధరలు తగ్గించడం గురించి మాట్లాడుతున్నారు. గుజరాత్లో ఆప్ కార్యకర్తలను అరెస్టు చేశారు. దానిని చడ్డా లేవనెత్తలేదు. ప్రధాన ఎన్నికల కమిషనర్కు వ్యతిరేకంగా తీసుకువచ్చిన తీర్మానం పై సంతకం చేయడానికి తిరస్కరించారు”. అని కౌంటర్ ఇచ్చింది

