అమెరికాలోని న్యూయార్క్ సిటీ మేయర్గా జోహ్రాన్ మామ్దానీ గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. చరిత్రాత్మకమైన మన్హట్టన్ సబ్వే స్టేషన్ వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. ఖురాన్ గ్రంధంపై చేయి వేసి ఆయన ప్రమాణం చేశారు.
మేయర్గా ప్రమాణ స్వీకారం చేపట్టడాన్ని గౌరవంగా, జీవితకాల అవకాశంగా భావిస్తున్నట్లు మామ్దానీ తెలిపారు. న్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం మేయర్గా మామ్దానీ నిలిచారు. ఓల్డ్ సిటీ హాల్ సబ్వే స్టేషన్ వద్ద ప్రమాణస్వీకార కార్యక్రమం జరగడం గమనార్హం.

