
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సత్యసాయి గ్రామాన్ని సందర్శించారు. గ్లోబల్ హ్యుమానిటేరియన్, ఆధ్యాత్మికవేత్త మధుసూదన్ సాయి నేతృత్వంలోని వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వివిధ మానవతా కార్యక్రమాలను పర్యవేక్షించారు. మధుసూదన్ సాయి మార్గదర్శకత్వంలో 2014లో సాయి సింఫనీ ఆర్కెస్ట్రా ప్రారంభమైంది. ఇందులో గ్రామీణ, పేద నేపథ్యాల నుంచి వచ్చిన 170 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్వదేశీ ఆర్కెస్ట్రా.