బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జర్నలిస్టుల అరెస్టులను సమర్థిస్తూ సజ్జనార్ మాట్లాడటాన్ని తప్పుబడుతూ, మీరు పోలీసు అధికారిలా కాకుండా కాంగ్రెస్ ప్రతినిధిలా మాట్లాడుతున్నారు. మీకు అంతగా ఇష్టముంటే ఖాకీ చొక్కా తీసేసి, కాంగ్రెస్ కండువా కప్పుకుని రాజకీయం చేయండి అంటూ ఘాటుగా విమర్శించారు. జర్నలిస్టుల అరెస్టులను వెనకేసుకురావడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన ధ్వజమెత్తారు. గతంలో మంత్రి కొండా సురేఖ, కేటీఆర్ పై , ఒక అగ్ర నటిపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలను హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

