శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుల మధ్య జరిగిన ప్రమాదం పలువురిని భయానికి గురి చేసింది. ఈ సంఘటన దోర్నాల మండలానికి సమీపంలో చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డుపై ఎక్కుతుండగా రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే అదృష్టవశాత్తూ బస్సుల్లో ఉన్న ప్రయాణికులకు తీవ్రమైన గాయాలు కాకుండా స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత మూడు గంటలు గడిచినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, ఘాట్ రోడ్డు పై సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

