ఉమెన్ వరల్డ్ కప్ విజయంలో ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి కీలకపాత్ర పోషించటం రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వ కారణమని ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ అభిప్రాయపడ్డారు. ఆమెకు స్వాగతం పలికేందుకు అభిమానులు కూడా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. వరల్డ్‌కప్‌లో విజయం సాధించిన జట్టులో ఉంటూ కీలక పాత్ర పోషించిన శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్‌లోకి గ్రాండ్ వెల్క్ం లభించింది. ఆమె ప్రతిభను మెచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది.

