శ్రీకాకుళం జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి ఇటీవల పెరుగుతుంది. జనవరి నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు మొత్తం 24 కేసులు నమోదయ్యాయి అని DMHO డాక్టర్ అనిత తెలియజేశారు. రాపిడ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిన కేసులను రిమ్స్ హాస్పిటల్ ELISA టెస్ట్ ద్వారా ఖచ్చిత నిర్ధారణ చేస్తున్నారు. రాపిడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని భయపడినా, ELISA టెస్ట్‌లో నిర్ధారణ కాని సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా సరే, జ్వరం ఐదు రోజులకు పైగా తగ్గకపోతే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.

