రంగారెడ్డి జిల్లా రంగారెడ్డిగూడలో అమాయకపు చిన్నారిని, రాత్రంతా తల్లి శవం వద్దనే వదిలేసిన, హత్య కేసులో దిగ్భ్రాంతికరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సహజీవనం చేసిన వ్యక్తి ఆమెను శనివారం రాత్రి చంపేసి బస్తాలో కుక్కినట్లు సమాచారం. అనంతరం చిన్నారిని తీసుకుని బైక్ పై ముందు భాగంలో బస్తా పెట్టుకుని వెళ్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. బైకైపై సుమారు 50-60 కి.మీ ప్రయాణించి రంగారెడ్డిగూడ వద్ద మృతదేహాన్ని పడేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాలను పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

