పొట్టి ప్రపంచకప్ కోసం వెయింటింగ్.. అన్నట్టుగా హార్దిక్ పాండ్యా చెలరేగిపోతున్నాడు. మూడు నెలల తర్వాత పునరాగమనం మ్యాచ్లోనూ అభిమానులకు పూనకాలు తెప్పించిన పాండ్యా.. టీ20ల్లో వేగవంతమైన అర్ధ శతకం బాదేశాడు.
సిరీస్ డిసైడర్ ఐదో మ్యాచ్లో శివమెత్తిన ఈ ఆల్రౌండర్ దక్షిణాఫ్రికా బౌలర్లను ఊచకోత కోస్తూ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. తద్వారా ఈ ఫార్మాట్లో టీమిండియా తరఫున రెండో వేగవంతమైన ఫిఫ్టీ నమోదు చేశాడీ హిట్టర్.

