చావోరేవో పోరులో భారత బ్యాటర్లు దంచేశారు. ఓపెనర్లు ప్రతీకా రావల్ (122), స్మృతి మంధాన(109) న్యూజిలాండ్ బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ బౌండరీలతో రెచ్చిపోయారు. జెమీమా రోడ్రిగ్స్(76 నాటౌట్) విధ్వంసక హాఫ్ సెంచరీతో స్కోర్‌బోర్డును ఉరికించింది. వరల్డ్ కప్ చరిత్రలోనే రికార్డు భాగస్వామ్యంతో భారీ స్కోర్‌కు గట్టి పునాది వేశారిద్దరూ. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 49వ ఓవర్లకు కుదించగా.. జెమీమా, రీచా ఘోష్(4 నాటౌట్) చెరొక బౌండరీ కొట్టడంతో.. టీమిండియా ప్రత్యర్థికి 241 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

