
అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న డీఆర్ఐ అధికారులకు పట్టుబడ్డారు ముగ్గురు ప్రయాణికులు, వారి నుంచి 3.38 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకన్న అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు ప్రయాణికులపై అనుమానం రావడంతో ఎయిర్‌పోర్టు అధికారులు వారిని అడ్డగించారు. వారి దగ్గర ఉన్న ఐరన్ బాక్స్‌ను తీసి తనిఖీ చేయగా.. అందులో 3.38 కిలోల బంగారాన్ని గుర్తించారు. దీంతో ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు.