
ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఓ కేసులో విజయవాడ పటమట పోలీసులు వ్యూహం సినిమా నిర్మాత ద దాసరి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాసరి కిరణ్ బంధువు గాజుల మహేష్ ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. కొంతకాలం క్రితం మహేష్ వద్ద నుంచి కిరణ్ రూ. 4.5కోట్లు అప్పుగా తీసుకున్నారు. డబ్బుల కోసం కిరణ్‌ను మహేష్ పదే పదే అడిగినప్పటికీ ఆయన పట్టించుకోలేదు మహేష్ దంపతులపై కిరణ్ అనుచరులు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మహేష్ విజయవాడ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు.