గతంలో వైఎస్సార్సీపీ విపక్షంలో ఉండగా 2016లో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం గుడివాడ అమర్నాథ్ పార్టీ నేతలతో కలిసి పలు ఆందోళనలు చేశారు. జీవీఎంసీ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. దీనిపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు ఇప్పటివరకూ కొనసాగుతోంది. ఈ కేసులో ఇవాళ విశాఖపట్నంలోని రెండో అదనపు ప్రధాన న్యాయస్ధానంలోని న్యాయమూర్తి ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. అలాగే 5వేల రూపాయల జరిమానా కూడా విధించారు.

