
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన డిజిటల్ బుక్‌లో కొన్ని చోట్ల సొంత పార్టీ నేతలపై ఫిర్యాదులు నమోదు అవుతుండటంతో వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. ఇటీవల వైసీపీ ఆవిష్కరించిన డిజిటల్ బుక్‌లో విడదల రజినీపై ఫిర్యాదు అందింది. తాజాగా మడకశిర వైసీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామిపై వైసీపీ డిజిటల్ బుక్‌లోకి ఫిర్యాదు చేరింది మున్సిపల్ చైర్మన్‌ను చేస్తానంటూ రూ. 25 లక్షలు తీసుకున్నట్లు కౌన్సిలర్ ప్రియాంక, ఆమె తండ్రి విక్రమ్ డిజిటల్ బుక్‌లో ఫిర్యాదు చేశారు.