తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ తరఫున 4వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచి, ప్రస్తుతం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న బావన రత్నకుమారి తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. గళగిరిలో టీడీపీ కీలక నేత పల్లా శ్రీనివాసరావు సమక్షంలో బావన రత్నకుమారి మరియు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఈ పరిణామంతో కొవ్వూరు మున్సిపాలిటీలో వైసీపీ బలం తగ్గి, టీడీపీ తన ఆధిక్యాన్ని నిరూపించుకుంది.

