వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తిరుమల లడ్డూలో వైవీ సుబ్బారెడ్డి ఎంత సంపాదించుకున్నారో తనకు తెలియదని.. మిగతా విషయాల్లో చాలా సంపాదించుకున్నారని తెలిపారు.
సుబ్బారెడ్డిని జైల్లో వేస్తే సంతోషించే మొదటి వ్యక్తి తానే అని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని సీఎం చంద్రబాబును కోరానని శ్రీనివాసరెడ్డి తెలిపారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో డ్వాక్రా గ్రూపుల్లో నగదు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

