ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్‌ను రాజస్థాన్ రాయల్స్ ఘనంగా ఆరంభించింది. ఆల్‌రౌండ్ షోతో చెన్నై సూపర్ కింగ్స్(CSK)ను వణికించిన రాజస్థాన్ 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. 128 పరుగుల స్వల్ప ఛేదనలో వైభవ్ సూర్యవంశీ(52), యశస్వీ జైస్వాల్(38 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగారు. బ్యాటింగ్, బౌలింగ్.. రెండు విభాగాల్లో దారుణంగా విఫలమైన సీఎస్కే ఘోర పరాభవం మూటగట్టుకుంది. ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తూ భారీ విజయంతో బోణీ కొట్టింది.

