సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ వందనపురి కాలనీకి చెందిన హారిక (28)కి నిన్న (బుధవారం) రాత్రి కడుపు నొప్పి రావడంతో స్థానికంగా ఉన్న తిరుమల హాస్పిటల్ కు వెళ్లింది. అయితే, యువతికి సర్జరీ చెయ్యాలని డాక్టర్లు యువతికి ఆపరేషన్ చేయగా వికటించి మరణించింది అని బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా హారిక నిండు ప్రాణం పోయిందని, హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవాలని ఆందోళన నిర్వహించారు. గతంలోనూ ఈ హాస్పిటల్ లో ఇదే తరహా సంఘటనలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు.

