
విశాఖపట్నం ద్వారకా నగర్ బస్టాండ్‌లో నిన్న భయానక ఘటన చోటుచేసుకుంది. బస్టాండ్‌లో ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, ఒక మహిళను ఢీకొట్టి మృత్యువాతకు గురి చేసింది. బస్సు నియంత్రణ కోల్పోవడంతో ప్లాట్‌ఫామ్ పైకి వెళ్లి అక్కడ ఉన్న మహిళను బలంగా ఢీ కొట్టడం తో బస్టాండ్‌లోని పిల్లర్కి, బస్సుకి మధ్యలో ఆ మహిళ చిక్కుకుని సంఘటనా స్థలంలోనే ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.