
విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికిన అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా నర్సీపట్నం బయలుదేరిన వైఎస్ జగన్. ఆయనకు విశాఖ ఎన్ఏడి కొత్త రోడ్డు సెంటర్‌లో మహిళలు దిష్టి తీశారు. వైఎస్ జగన్ విశాఖ, అనకాపల్లి టూర్. ఈ టూర్‌కి మొదటి నుంచి ప్రభుత్వం రకరకాల అడ్డంకులు పెట్టింది. జగన్ విశాఖ ఎయిర్‌పోర్టులో దిగారో లేదో.. జన సందోహం మొదలైంది. దారి పొడుగునా.. కాన్వాయ్ సాగుతున్నంతసేపూ.. జనం బ్రహ్మరథం పడుతున్నారు.