మరి కొద్ది నిమిషాలలో పవన్ కళ్యాన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ షోస్ జరుపుకోనుంది. విశాఖపట్నంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ పవన్ అభిమానులకు ప్రత్యేకంగా నిలిచింది. ఈ ఈవెంట్లో సినిమా యూనిట్‌తో పాటు రాజకీయ నాయకులు, పవన్ సన్నిహితులు కూడా హాజరయ్యారు. నటుడిగా తనను తీర్చిదిద్దిన గురువుకు సన్మానం చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ మానవీయతను, వినయాన్ని మరోసారి ప్రదర్శించారు. ఇక ఈవెంట్లో ఉత్తరాంధ్ర పాటలు కూడా పాడి అలరించారు పవన్. ఎంఎం కీరవాణిని కూడా పవన్ ప్రత్యేకంగా సన్మానించారు.

