ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఫాస్ట్ బౌలర్‌గా జాతీయ జట్టుకు 21 ఏళ్లు విశేష సేవలందించిందుకు ‘నైట్‌హుడ్’ బిరుదును స్వీకరించాడీ లెజెండ్. బ్రిటన్ రాణి అన్నె చేతుల మీదుగా మంగళవారం అండరన్సన్ నైట్ హుడ్ మెడల్‌ను అందుకున్నాడు. ఇక నుంచి అండర్సన్ పేరు ముందు సర్ అనే పదం చేరనుంది. ఇప్పటివరకు 12 మంది ఇంగ్లండ్ మాజీలు మాత్రమే ఈ అవార్డు అందుకున్నారు.

