పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదల కానుండగా, కర్ణాటకలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు టైటిల్‌తో ప్రచారం చేయడంపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బళ్లారిలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను కన్నడ భాషాభిమానులు తొలగించారు. కన్నడలో కాకుండా తెలుగులో ప్రచారం చేయడంపై వారు అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

