
బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్…గత కొన్నేళ్లుగా అనేక సవాళ్లను ఎదుర్కుంటోంది. పలుమార్లు సాంకేతిక సమస్యలతో ప్రయాణికులను ఇబ్బంది పెట్టింది. N819AN రిజిస్ట్రేషన్ కోడ్ కలిగిన డ్రీమ్‌లైనర్ 25 రోజుల వ్యవధిలో అనేక సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పెట్టింది. హైడ్రాలిక్ లీక్‌లు, సాంకేతిక లోపాల కారణంగా పలుమార్లు డైవర్ట్ అయింది, ఫలితంగా అనేక విమానాలు రద్దయ్యాయి.ప్రముఖ బోయింగ్ ఇంజనీర్లు కూడా బోయింగ్ 787, 777 మోడల్స్‌లో తయారీ లోపాలు ఉన్నాయని తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు.