2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణలు చేస్తూ రూపొందించిన ప్రత్యేక బిల్లును కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుత చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగియడంతో, అమరావతిని అధికారికంగా ధృవీకరించేందుకు విభజన చట్టంలోని సెక్షన్ 5(2)కి సవరణలు చేశారు. ఈ బిల్లుకు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడం విశేషం. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించాలని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ డిమాండ్ చేశారు.

